- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | నిజాంసాగర్​కు కొనసాగుతున్న వరద

Nizamsagar | నిజాంసాగర్​కు కొనసాగుతున్న వరద

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nizamsagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు (Nizamsagar project ) ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ఉమ్మడి మెదక్​, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి ఇన్​ఫ్లో పెరిగింది.

ప్రాజెక్ట్​లోకి ప్రస్తుతం 70,572 క్యూసెక్కుల ఇన్​ఫ్లో (Inflow) వస్తుండగా.. అధికారులు 10 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. వరద గేట్ల ద్వారా 69,322 క్యూసెక్కులు, ప్రధాన కాలువకు 1,250 క్యూసెక్కులు వదులుతున్నారు. జలాశయం (reservoir) పూర్తిస్థాయి నీటిమట్టం 1405 (17.802 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1401.76 (13.391 టీఎంసీలు) అడుగుల నీరు ఉంది.

- Advertisement -

Nizamsagar | పోచారం ప్రాజెక్ట్​లోకి..

నాగిరెడ్డిపేటలోని పోచారం ప్రాజెక్ట్​కు (Pocharam project) స్వల్ప ఇన్​ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థం 1.82 టీఎంసీలు కాగా.. నిండుకుండలా ఉంది. ప్రస్తుతం డ్యామ్​లోకి 1,731 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. అంతేమొత్తం అలుగుపై నుంచి పారి మంజీరలోకి వెళ్తోంది. డ్యామ్​ పొంగిపొర్లుతుండటంతో చూడటానికి పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News