అక్షరటుడే, ఇందూరు: Nizamabad Urban MLA | అనారోగ్యంతో బాధపడి చికిత్స పొందిన బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులను బుధవారం క్యాంప్ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పంపిణీ చేశారు. మొత్తం 65 మందికి రూ.27.51 లక్షలను అందజేశారు. ఎటువంటి జాప్యం లేకుండా దరఖాస్తులను వెంటనే సెక్రటేరియట్ పంపడం జరుగుతుందన్నారు.
