ePaper
More
    HomeతెలంగాణTraffic acp | ట్రాఫిక్‌ ఏసీపీ నారాయణపై బదిలీ వేటు.. పూర్తి ప్రక్షాళన అవసరం

    Traffic acp | ట్రాఫిక్‌ ఏసీపీ నారాయణపై బదిలీ వేటు.. పూర్తి ప్రక్షాళన అవసరం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Traffic acp | నిజామాబాద్‌ ట్రాఫిక్‌ ఏసీపీ నారాయణపై nizamabad traffic Acp narayana బదిలీ వేటు పడింది. డీజీపీ DGP office telangana కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా.. నిజామాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం నూతన ఏసీపీగా సీటీసీలో ఉన్న మస్తాన్‌ అలీకి masthan Ali బాధ్యతలు అప్పగించారు. ఏసీసీ నారాయణ బదిలీ అంశం నిజామాబాద్‌ కమిషనరేట్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. అలాగే మరో అధికారి పైనా పలు ఆరోపణలు బయటకు వచ్చాయి.

    నిజామాబాద్‌ ట్రాఫిక్‌ విభాగంలో ఏసీపీగా పనిచేస్తున్న నారాయణపై మొదటి నుంచి తీవ్ర అవినీతి ఆరోపణలున్నాయి. ప్రత్యేకించి పలువురు వ్యాపారుల నుంచి పెద్దఎత్తున వసూళ్లు చేయించేవారని, మొరం, ఇసుక తరలించే వాహనాలను ఇష్టారాజ్యంగా టౌన్‌లోని అనుమతించి డబ్బులు తీసుకోవడంపై ఫిర్యాదులున్నాయి. తాజాగా ట్రాఫిక్‌ విభాగంలో ఓ అంశంలో మహిళా కానిస్టేబుల్‌ సైతం ఏసీపీ తీరుపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై విచారణ జరిపిన స్పెషల్‌ బ్రాంచి విభాగం అధికారులు సీపీకి cp nizamabad నివేదిక అందించారు. అనంతరం తదుపరి చర్యల కోసం డీజీ కార్యాలయానికి నివేదిక పంపగా.. ఉన్నఫలంగా ఇక్కడి విధుల నుంచి తప్పంచి డీజీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు.

    Traffic acp | ఆగని అడ్డగోలు వసూళ్లు

    ట్రాఫిక్‌లో పనిచేస్తున్న అధికారులు అడ్డుగోలుగా వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల నుంచి కోర్టు పీసీ ద్వారా వసూలు చేయడమే కాకుండా సైలెన్సర్ల తొలగింపు వెనుక మరో అధికారి పాత్ర ఉంది. ఓ దుకాణం నిర్వాహకుడితో కలిసి నడుపుతున్న తతంగంపైనా చర్చ జరుగుతోంది. అలాగే.. వీక్లిమార్కెట్‌లో ఉండే సదరు అధికారి తన ఇంటి పనుల కోసం ఏకంగా అక్కడ హోంగార్డును డిప్యూట్‌ చేసి సొంత పనులు చేయించుకుంటున్నారని సమాచారం. సోమవారం “అక్షరటుడే”లో ప్రచురితమైన కథనం ప్రచురితం కాగా.. అధికారులు విచారణ మొదలు పెట్టినట్లు సమాచారం.

    More like this

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...