HomeతెలంగాణYavatmal | నిజామాబాద్ టు యావత్మల్​.. జోరుగా సాగుతున్న జూదం

Yavatmal | నిజామాబాద్ టు యావత్మల్​.. జోరుగా సాగుతున్న జూదం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Yavatmal | నిజామాబాద్​ కమిషనరేట్​ (Nizamabad Commissionerate) పరిధిలో జూదం పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో నిర్వాహకులు మకాం మార్చేశారు. జూదరులను గ్రూప్​లుగా తయారు చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. జిల్లాకు సమీపంలో ఉన్న యావత్మల్​లో గల పలు పేకాట క్లబ్​లకు జిల్లాకు చెందిన జూదరులను తరలించి రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు.

నిజామాబాద్​ నగరానికి చెందిన పేకాట నిర్వాహకులు యావత్మల్​ జిల్లాలో అడ్డాలు తెరిచినట్లు సమాచారం. పఠన్​ బోరీ, బోరీ, రాజూరా ప్రాంతాల్లో పలు రిక్రియేషన్​ క్లబ్​లను తెరిచారు. అధికారికంగా పేకాట నిర్వహించేందుకు ఎలాంటి అనుమతులు లేకపోయినా.. అక్కడి అధికారుల అండదండలతో జూదాలు (Gambling) నడిపిస్తున్నారు. దీంతో జిల్లాలో ఇప్పటికే జూదానికి బానిసలుగా మారిన వారు యావత్మల్​ క్లబ్​లకు వెళ్తున్నట్లు సమాచారం. ఇందుకోసం జిల్లాకు చెందిన నిర్వాహకులు ప్రత్యేకంగా వాహనాలను సమకూర్చడంతో పాటు సకల రాచమర్యాదలు కల్పిస్తున్నట్లు వినికిడి. ఒక్కో టేబుల్​లో రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు నడిపిస్తున్నారు.

Yavatmal | ప్రత్యేక వాహనాల్లో..

ఒక్క నిజామాబాద్​ జిల్లా నుంచే నిత్యం లక్షల్లో పేకాట కోసం దారాపోస్తున్నారు. జిల్లా నుంచి నిత్యం పదుల సంఖ్యల్లో వాహనాల్లో ఈ పేకాట క్లబ్​లకు తరలిస్తున్నారని సమాచారం. గతంలో జిల్లాకు సమీపంలోని ధర్మాబాద్ (Dharmabad)​ తదితర చోట్ల అడ్డాలు నడిపించిన నిర్వాహకులే తిరిగి యావత్మల్​ ప్రాంతంలో పేకాట దందాకు తెర లేపినట్లు తెలుస్తోంది. జూదానికి బానిసలుగా మారిన వారిని ఆసరాగా చేసుకొని రోజుకు రూ.లక్షల్లో ఆర్జిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వారి పట్ల కమిషనరేట్​ పోలీసులు నిఘా ఉంచాలని పేకాటకు బానిసలుగా మారిన కుటంబ సభ్యులు కోరుతున్నారు.

Must Read
Related News