అక్షరటుడే, ఇందూరు: Nizamabad Security Council | సైబరాబాద్ Cyberabad లాంటి మహా నగరాల్లో అందుబాటులో ఉండే సెక్యూరిటీ కౌన్సిల్ నిజామాబాద్‌లోనూ ఆవిష్కృతమైంది.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య Nizamabad Police Commissioner Sai Chaitanya ప్రోద్బలంతో ఈ సెక్యూరిటీ కౌన్సిల్ అందుబాటులోకి వచ్చింది. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను సోమవారం (అక్టోబరు 27) సీపీ సాయి చైతన్య ప్రారంభించారు.
ఈ కౌన్సిల్ లోగోను ఆవిష్కరించారు. ఇందుకు నిజామాబాద్ నగరంలోని ప్రముఖులు హాజరయ్యారు. ఈ కమిటీలో కాకతీయ విద్యా సంస్థల అధినేత రజనీకాంత్, డాక్టర్ కవితారెడ్డి, ఎన్జీఎస్ అధినేత సంతోష్, బుస్స ఆంజనేయులు, వ్యాపారులు, ప్రముఖులు ఉన్నారు.
Nizamabad Security Council | సహాయ సహకారాలు..
అవగాహన, భద్రత, సహకారం కోసం ఈ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఆయా వర్గాల వారిని భాగస్వాములుగా చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ ప్రధాన లక్ష్యం.
IT ఉద్యోగులు, విద్యార్థులు, ఉమెన్ భద్రతతో కౌన్సిల్ సహకారం తీసుకుంటారు. Cybercrime, సామాజిక మాధ్యమాల మోసాలు, ఆన్‌లైన్ స్కామ్‌ల మీద అవగాహన కల్పించడం తదితరాలు ఈ కౌన్సిల్ విధి.
