Road Safety Awareness Program | ట్రాఫిక్​ నిబంధనలపై అవగాహన ఉండాలి : సీపీ సాయి చైతన్య

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Road Safety Awareness Program | సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) సూచించారు. రోడ్డు భద్రత ప్రమాదాల నివారణపై విద్యార్థులు ఇతరులను చైతన్యవంతం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించడం కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అలైవ్​ అరైవ్​ (Arrive Alive) కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్​ నగరంలోని విజయ హై స్కూల్​ (Vijaya High School) విద్యార్థులకు మంగళవారం […]

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Road Safety Awareness Program | సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) సూచించారు. రోడ్డు భద్రత ప్రమాదాల నివారణపై విద్యార్థులు ఇతరులను చైతన్యవంతం చేయాలన్నారు.

రోడ్డు ప్రమాదాలు నివారించడం కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అలైవ్​ అరైవ్​ (Arrive Alive) కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్​ నగరంలోని విజయ హై స్కూల్​ (Vijaya High School) విద్యార్థులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ హాజరై మాట్లాడారు. రోడ్డు ప్రమాదం అంటే ఒక కుటుంబం రోడ్డు పాలవడమని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు నిత్యం అనేకం చోటు చేసుకుంటున్నాయని తెలిపారు.

Road Safety Awareness Program | జాగ్రత్తలతో..

రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే అవగాహన, ముందస్తు జాగ్రత్తలే మార్గమని సీపీ తెలిపారు. విద్యార్థి దశ నుంచే సామాజిక అంశాల పట్లపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యార్థులు అంబాసిడర్లుగా ఉండి తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారిని చైతన్యవంతం చేయాలని సూచించారు. క్రమశిక్షణ పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ పీస్ ఎస్​హెచ్​వో ప్రసాద్, ఐరాడ్ మేనేజర్ వర్షా నిహాంత్, విజయ్ హై స్కూల్ ప్రిన్సిపాల్ ప్రభాదేవి, సుజాత, వసంత పాల్గొన్నారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

GeoSpy AI | లొకేషన్‌తో పనిలేకుండా ఫొటో అడ్రస్ పట్టేస్తుంది

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: GeoSpy AI | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence - AI) వినియోగం పెరిగాక ప్రతి విషయం తెలుసుకోవడంలో స్పష్టత మరింత...

TGSRTC app ticket booking | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. యాప్​లో ఆర్టీసీ బస్సు టికెట్లు బుక్​ చేసుకోవచ్చు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGSRTC app ticket booking | ఆర్టీసీ బస్సుల్లో యాప్​ ద్వారా టికెట్లు బుక్​ చేసుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ...

HYDRAA land protection | రూ.100 కోట్ల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతంది. వందల కోట్ల విలువైన ప్రభుత్వ,...

Congress Warning to Rakesh | రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో..: కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.