అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad Real Estate | నిజామాబాద్ Nizamabad కంఠేశ్వర్ – మాధవనగర్ బైపాస్ రోడ్డు Kanteshwar-Madhavanagar bypass road లో గల ఓ విల్లా వెంచర్లో ఇరిగేషన్ భూమిని ఆక్రమించిన వ్యవహారం ‘అక్షరటుడే’ వెలుగులోకి తేగా.. దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది.
కొందరు బడా రియలర్లు గేటెడ్ కమ్యూనిటీ పేరిట విల్లాలు నిర్మిస్తున్నారు. గతంలో పని చేసి వెళ్లిన ఓ రెడ్డి ఐఏఎస్ అధికారి ఈ వెంచర్‌కు సంబంధించి అనుమతుల విషయంలో అన్నీ తానై చూసుకున్నాడు. దీంతో ఇరిగేషన్ అధికారులు నిబంధనలు పక్కనబెట్టి ‘మామూలు’గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Nizamabad Real Estate | బఫర్ జోన్, అప్రోచ్ రోడ్డు ఏదీ..
సర్వే నంబరు 570ను ఆనుకుని పూర్తిగా ఇరిగేషన్ నోటిఫైడ్ కాల్వ స్థలం ఉంది. కాగా, దీనికి రెండు వైపులా తొమ్మిది మీటర్ల మేర బఫర్ జోన్ buffer zone, ఆ తర్వాత 30 ఫీట్ల అప్రోచ్ రోడ్డు approach road తప్పనిసరి. ఆ తర్వాతే నివాస సముదాయాల నిర్మాణానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
కానీ, ఈ కాల్వకు రోడ్డు వైపున ఉన్న సర్వే నంబరులో గేటెడ్ కమ్యూనిటీ ఏర్పాటు చేసి, విల్లాలు నిర్మిస్తున్న రియల్టర్లు బఫర్ జోన్ స్థలాన్ని కబ్జా చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బఫర్ జోన్ స్థలంలో పలు నిర్మాణాలు చేపట్టినట్లు సమాచారం. వాస్తవానికి బఫర్‌జోన్ స్థలాలను మినహాయించి, అప్రోచ్ రోడ్డు తర్వాతే నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా.. ఎవరూ అడిగే వారు లేరని, సదరు రియల్టర్లు దర్జాగా నిర్మాణాలు చేపట్టడం గమనార్హం.
కాగా, ఈ విషయంలో ఇరిగేషన్ శాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. మామూలు ప్రజలు చిన్నపాటి స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే ఎన్ఓసీ ఇచ్చేందుకు లేనిపోని కొర్రీలు పెట్టే అధికారులు.. ఇలాంటి బడా రియల్టర్లకు అన్నీ తామై అండదండలు అందిస్తుండటంపై విమర్శలు వెలువడుతున్నాయి. పైపెచ్చు ఈ వెంచర్లో పలువురు రాజకీయ ప్రముఖులు సైతం విల్లాలు నిర్మించుకోవడంతో ఇరిగేషన్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.