అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad private hospital | నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. దీంతో ఆస్పత్రి ఎదుట సీఐటీయూ నాయకులు (CITU leaders), మెడికల్ రిప్రజెంటేటివ్ నాయకులు, మృతుడి కుటుంబ బంధుమిత్రులు ఆందోళనకు దిగారు.
Nizamabad private hospital | వివరాలు ఇలా ఉన్నాయి.
ఆర్మూర్‌కు చెందిన ఓ ప్రైవేటు ఫార్మా కంపెనీ (private pharma company)లో మెడికల్ రిప్రజెంటేటివ్(medical representative)గా పనిచేస్తున్న సాయికుమార్ (26) వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మృతి చెందాడని ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. సాయికుమార్ హైదరాబాద్ (Hyderabad) నుంచి తన బంధువులను కారులో తీసుకొస్తున్న సమయంలో భిక్కునూరు శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో సాయికుమార్ తో పాటు మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. అతని చేతికి, కాలుకు తీవ్ర గాయమైందని చెప్పి ఫ్రూడెన్స్ హాస్పిటల్ వర్గాలు చేర్చుకొని చికిత్స ప్రారంభించారు. వైద్యం చేస్తుండగా సాయికుమార్ మరణించాడని తెలపడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
కుటుంబ సభ్యులు, సీఐటీయూ నాయకులు నిలదీయగా.. సమాధానం చెప్పడానికి హాస్పటల్ వర్గాలు చాటేశాయి. ఈ విషయంలో మృతుడి బంధువులు, అతనితో పనిచేసే మెడికల్ రిప్రజెంటివ్ సంఘం సభ్యులు ఆసుపత్రి చేరుకొని ధర్నాకు దిగారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయూ నాయకులు నూర్జహన్, కఠారి రాములు మానవ హక్కుల సంఘం అధ్యక్షురాలు రషీదా బేగం, తెలంగాణ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ తో పాటు తోటి ఉద్యోగులు డిమాండ్ చేశారు.