119
అక్షరటుడే, ఇందూరు: Nizamabad Press Club | నిజామాబాద్ ప్రెస్ క్లబ్ Nizamabad Press Club అధ్యక్షుడిగా పంచరెడ్డి శ్రీకాంత్ గెలుపొందారు. ప్రెస్ క్లబ్ ఎన్నికలను మంగళవారం నిర్వహించారు. అధ్యక్ష పదవికి పలువురు సీనియర్ జర్నలిస్టులు పోటీ పడగా.. శ్రీకాంత్ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
Nizamabad Press Club | ప్రధాన కార్యదర్శిగా..
ఇక ప్రధాన కార్యదర్శిగా వాగ్మారె సుభాష్ గెలుపొందారు. ఉపాధ్యక్షులుగా బైస సంగీత, సతీష్ గౌడ్ విజయం సాధించారు. కోశాధికారిగా రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజు ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా సురేష్, రవి నాయక్, అంజనేయులు గెలుపొందారు.