Nizamabad Police Prajavani | పోలీస్​ ప్రజావాణిలో వినతులు స్వీకరించిన సీపీ

పోలీస్​ ప్రజావాణిలో భాగంగా సోమవారం సీపీ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య 30 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం పోలీస్​డ్యూటీ మీట్​లో పతకాలు సాధించిన సిబ్బందిని అభినందించారు.

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Police Prajavani | నగరంలోని సీపీ కార్యాలయంలో సోమవారం పోలీస్ ​ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య(CP Saichaitanya) ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

Nizamabad Police Prajavani | 30 ఫిర్యాదులు..

ఈ సందర్భంగా సీపీ ప్రజావాణిలో (Nizamabad Police Prajavani) 30 ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యలు విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవచ్చని సీపీ తెలిపారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని చెప్పారు.

విధులతో పాటు క్రీడల్లోనూ రాణించాలి..

విధులతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సీపీ సాయిచైతన్య సూచించారు. తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్​లో (Telangana Police Sports Meet 2026) జిల్లా నుంచి పోలీస్​ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పతకాలు సాధించగా.. వారిని సీపీ అభినందించారు.

గచ్చిబౌలి స్టేడియంలో..

హైదరాబాద్‌లోని (hyderabad) గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం (Gachibowli Indoor Stadium), సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు జరిగిన 4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2026లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చూపారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన సిబ్బందిని సీపీ సోమవారం తన కార్యాలయంలో ప్రత్యేకగా అభినందించారు. వివిధ విభాగాల్లో నిజామాబాద్​ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పాల్గొన్న సిబ్బంది 4 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్, 9 బ్రాంజ్​ మెడల్స్ సాధించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (ఏఆర్) రామచంద్రరావు, పతకాలు సాధించిన పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

MEO Bribery Case | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంఈవో

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MEO Bribery Case | లంచం తీసుకుంటూ ఓ ఎంఈవో ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం (Srikakulam)...

దేశవ్యాప్తంగా 32 ‘ఆరోగ్య సేవా కేంద్రాలు’ ప్రారంభించిన స్టార్ హెల్త్.. ఉచితంగా వైద్య సేవలు

చెన్నై: భారతదేశపు అగ్రగామి హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ 'స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్', సామాజిక బాధ్యతలో భాగంగా సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని...

స్వరాజ్ ట్రాక్టర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోనీ ప్రయాణం మళ్ళీ షురూ!

మొహాలీ: ప్రముఖ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన 'స్వరాజ్ ట్రాక్టర్స్', క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీతో తమకున్న ఒప్పందాన్ని మరింత కాలం పొడిగిస్తున్నట్లు అధికారికంగా...

Mutyala Sunil Kumar | ప్రశాంత్ రెడ్డికి రైతులపై మాట్లాడే అర్హత లేదు: ముత్యాల సునీల్ కుమార్

వేముల ప్రశాంత్ రెడ్డికి రైతులపై మాట్లాడే అర్హత లేదని ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.