అక్షరటుడే, ఇందూరు : Peaceful Municipal Elections | అందరి సహకారంతో జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తెలిపారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం మున్సిపల్ కమిషనర్‌ను (Municipal Commissioner) ఎన్నికల విధుల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన అధికారులను సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేసిన ఫలితంగానే ఎన్నికలను సజావుగా నిర్వహించుకోగలిగామన్నారు.
Peaceful Municipal Elections | మూడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో..
జిల్లాలోని మూడు మున్సిపాలిటీలో నగరపాలక సంస్థలో ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని కలెక్టర్ అన్నారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ జిల్లా యంత్రాంగం తరపున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో (Vikas Mahato), అభిగ్యాన్ మాల్వియా (Abhigyan Malviya), నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రవిబాబు, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపల్ కమిషనర్లు జాదవ్ కృష్ణ, ఉమామహేశ్వరరావు, గంగాధర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, రిటర్నింగ్ అధికారులు నర్సయ్య, నరేష్, బస్వంత్, హఫీజుద్దీన్లను సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఏవో ప్రశాంత్ పాల్గొన్నారు
