అక్షరటుడే, ఇందూరు : Nizamabad Municipal Polling | నగరంలోని హైదరాబాద్ రోడ్లోని ఓ హోటల్లో యాజమాన్యం వినూత్నమైన ఆఫర్ ప్రకటించింది. ఓటు వేసి సిరా చుక్కను చూయిస్తే ఉచితంగా టీ అందజేసింది. నగరంలోని కపిల హోటల్ (Kapila Hotel)లో ఈ ఆఫర్ను ప్రకటించారు. దీంతో తేనీటి ప్రియులు బారులు తీరారు.
Nizamabad Municipal Polling | ఉత్సాహంగా తరలివస్తున్న యువత..
జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) భాగంగా యువతీయువకులు ఉత్సాహంగా ఓటు వేసేందుకు తరలివస్తున్నారు. ఉదయం కొద్దిమేర మందకోడిగా ప్రారంభమైన పోలింగ్.. తర్వాత ఊపందుకుంది. పలు కాలనీల్లో కార్పొరేటర్ అభ్యర్థులు ఓటర్లను ఉత్సాహపరుస్తున్నారు. ఓటు వేసేందుకు తరలిరావాలని కోరుతున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Nizamabad Municipal Polling | 8.25 శాతం ఓటింగ్ నమోదు..
నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో నగరపాలక సంస్థతోపాటు మూడు మున్సిపాలిటీలో కలిపి మొత్తం 8.25 శాతం ఓటింగ్ నమోదైంది. ఆర్మూర్లో 11.05 శాతం, బోధనలో 14.24 శాతం, భీమ్గల్లో 9.38 శాతం ఓటింగ్ నమోదైంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) వినాయక్ నగర్లో 19వ డివిజన్లోని శ్రీ చైతన్య హైస్కూల్ పోలింగ్ బూత్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా (Bigala Ganesh Gupta) ఓటువేశారు. ప్రతి ఒక్కరు ఓటు వేసి అత్యధిక ఓటింగ్ శాతం నమోదు చేయాలని వారు కోరారు.