అక్షరటుడే, వెబ్డెస్క్ : Nizamabad Municipal Polling | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల (Municipal elections) పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. నిజామాబాద్ కార్పొరేషన్ (Nizamabad Corporation)తో సహా ఏడు మున్సిపాలిటీల్లో ఓటర్లు బారులు తీరారు.
పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొదట మందకొడిగా సాగిన పోలింగ్ ప్రక్రియ 8 గంటల తర్వాత జోరందుకుంది. ఉదయం 9 గంటల వరకు భీమ్గల్ మున్సిపాలిటీ (Bhimgal Municipality) పరిధిలో 9.38 శాతం పోలింగ్ నమోదయిందని అధికారులు తెలిపారు. బోధన్ మున్సిపాలిటి (Bodhan Municipality)లో 14.24 శాతం, ఆర్మూర్లో 11.05 శాతం పోలింగ్ నమోదు అయింది.
ఎన్నికలకు అధికారులు అన్ని వసతులు కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేపట్టకుండా చర్యలు చేపట్టారు. పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. అభ్యర్థులు తమ వార్డు పరిధిలోని ఓటర్లు అందరు ఓటు వేసే ఏర్పాట్లు చేస్తున్నారు. బోధన్ మున్సిపాలిటీలో ఓటింగ్ సరళిని జిల్లా అబ్జర్వర్ సత్యనారాయణ రెడ్డి పరిశీలించారు.
1 comment
[…] Campaigning Controversy | భీమ్గల్ మున్సిపాలిటీ (Bhimgal Municipality) పరిధిలో పోలింగ్ ఉత్సాహంగా […]
Comments are closed.