అక్షరటుడే, ఇందూరు : Nizamabad Municipal Polling | జిల్లాలో నిజామాబాద్ నగరపాలక సంస్థతోపాటు మూడు మున్సిపాలిటీలో కలిపి మొత్తం 8.25 శాతం ఓటింగ్ నమోదైంది. ఆర్మూర్‌లో 11.05 శాతం, బోధనలో 14.24 శాతం, భీమ్‌గల్‌లో 9.38 శాతం ఓటింగ్ నమోదైంది.
Nizamabad Municipal Polling | వినాయక్‌నగర్‌లో ఎంపీ..
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) వినాయక్ నగర్లో, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంగడి బజార్‌లోని సన్‌ఫ్లవర్ స్కూల్లో తమఓటు హక్కును వినియోగించుకున్నారు. 19వ డివిజన్లోని శ్రీ చైతన్య హైస్కూల్ పోలింగ్ బూత్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా (Bigala Ganesh Gupta) ఓటువేశారు. ప్రతి ఒక్కరు ఓటు వేసి అత్యధిక ఓటింగ్ శాతం నమోదు చేయాలని వారు కోరారు.
తరలివస్తున్న ఓటర్లు..
మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) భాగంగా బుధవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే ఓటర్లు సైతం ఉదయం నుంచి ఓటు వేసేందుకు తరలి వస్తున్నారు. పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
