అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad Municipal Elections Polling | ప్రజల సహకారంతోనే మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) ప్రశాంతంగా ముగిశాయని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.
Nizamabad Municipal Elections Polling | కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో..
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Nizamabad Municipal Corporation)తో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి ఫిబ్రవరి 11వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కృషిచేసిన అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజలందరికి సీపీసాయి చైతన్య (CP Sai Chaitanya) కృతజ్ఞతలు తెలిపారు. శాంతి భద్రతల కోసం పోలీస్ శాఖ (Police Department) తరపున కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు ఎనలేనికృషి చేశారన్నారు. వ్రజలు, పోలీసు అధికారుల మధ్య సమన్వయంతోనే ఈ ఎన్నికలు నజావుగా నిర్వహించగలిగామని తెలిపారు.
Nizamabad Municipal Elections Polling | నిజామాబాద్ జిల్లాలో 61.90శాతం
జిల్లాలో నిజామాబాద్ నగరపాలక సంస్థతోపాటు (Nizamabad Municipal Corporation) మూడు మున్సిపాలిటీలు కలిపి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 61.90 శాతం ఓటింగ్ నమోదయింది. నిజామాబాద్ కార్పొరేషన్ లో 59.12 శాతం ఆర్మూర్లో 68 శాతం, బోధనలో 68.64 శాతం, భీమ్గల్లో 69.78 శాతం ఓటింగ్ నమోదయింది. జిల్లావ్యాప్తంగా 4,95,485 మంది ఓటర్లు ఉండగా… 3,06,697 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కామారెడ్డి జిల్లాలో 69.48శాతం పోలింగ్..
కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో 69.48 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో 1,49,525 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 1,03,895 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇందులో మహిళలు 54,487 మంది, పురుషులు 49,393 మంది, ఇతరులు 16 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.