అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nizamabad Municipal Election Results | నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ పట్టు నిలుపుకుంది. గత ఎన్నికల్లో 28 డివిజన్లలో గెలిచిన కమలం పార్టీ ఈ సారి కూడా తన స్థానాలను కాపాడుకుంది.
నిజామాబాద్ కార్పొరేషన్ (Nizamabad Corporation)లో గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా శ్రమించింది. ఎంపీ అర్వింద్ (MP Arvind) ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగురవేయాలని యత్నించారు. అయితే మెజారిటీకి కొద్ది దూరంలో బీజేపీ (BJP) ఆగిపోయింది. అయితే గతంలో సాధించిన సీట్లను కాపాడుకోవడంలో మాత్రం సఫలం అయింది. మరోవైపు బీఆర్ఎస్ కార్పొరేషన్లో కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించింది. గత ఎన్నికల్లో 13 సీట్లు పొందిన గులాబీ పార్టీ (BRS Party) ఈ సారి ఒక సీటుకు పరిమితం కావడం గమనార్హం. కాగా హంగ్ రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతు సైతం కీలకం కానుంది.
Nizamabad Municipal Election Results | గత ఎన్నికల్లో..
నిజామాబాద్ కార్పొరేషన్ గత ఎన్నికల్లో బీజేపీ 28 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఎంఐఎం 16, బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 2,
స్వతంత్ర అభ్యర్థి ఒక చోట గెలుపొందారు. అయితే మెజారిటీ రాకపోవడంతో బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోలేదు. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థి, ఎక్స్ ఆఫిషీయో ఓట్లతో కలిసి కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. దండు నీతూకిరణ్ బీఆర్ఎస్ నుంచి మేయర్ అయ్యారు.
Nizamabad Municipal Election Results | ఈ ఎన్నికల్లో..
ప్రస్తుత కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 28 స్థానాల్లో గెలుపొందింది. గతంలో రెండు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ (Congress) ఈ సారి 18 సీట్లను కైవసం చేసుకుంది. ఎంఐఎం 16 నుంచి 13కు పడిపోయింది. అయితే ఈ సారి కూడా బీజేపీ 28 స్థానాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో మేయర్ పీఠం కోసం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎక్స్ ఆఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. కాంగ్రెస్, ఎంఐఎం కలిస్తే 31 సీట్లు అవుతాయి. అప్పుడు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవచ్చు. అయితే ఆ రెండు పార్టీలు కలుస్తాయా లేదా అనేది ఈ నెల 16న తేలనుంది. మరోవైపు కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ప్రచారం అయిన శమంత నరేందర్‌రెడ్డి ఓడిపోయారు. 19వ వార్డులో ఆమెపై బీజేపీ అభ్యర్థి నాగోళ్ల లక్ష్మీనారాయణ గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ సాగుతోంది.