అక్షరటుడే, ఇందూరు : Nizamabad Mayor Uma Rani | నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్‌గా ఉమారాణి ఎన్నికయ్యారు. ఈ మేరకు నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు చేతులెత్తి ఎన్నుకున్నారు. ఉదయం 11 గంటలకు మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) విజయం సాధించిన కార్పొరేటర్లతో ప్రమాణస్వీకారం చేయించారు.
నగరంలో 14 మంది ఎంఐఎం కార్పొరేటర్ల సహకారంతో కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అలాగే బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన ఏకైక కార్పొరేటర్ పేట విజయలక్ష్మి కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. దీంతో మొత్తానికి మేయర్ పీఠానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 31ని దాటి ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కలుపుకొని 34 కు చేరుకుంది. కాగా.. కూరగాయాల ఉమారాణిని అధికారులు మేయర్‌గా ప్రకటించారు. కాగా.. బీజేపీకి మొత్తం 31 ఓట్లు వచ్చాయి. కాగా.. డిప్యూటీ మేయర్‌గా ఎంఐఎంకు చెందిన 54వ డివిజన్ అభ్యర్థి సల్మా తహసీన్ ప్రమాణ స్వీకారం చేశారు.
Nizamabad Mayor Uma Rani | కూరగాయల ఉమారాణి నేపథ్యమిది..
నగరంలోని 49వ డివిజన్లోని కసాబ్‌గల్లీకి (Kasabgalli) చెందిన కూరగాయల రమేష్ (కరాటే రమేష్)గా అందరికి సుపరిచితుడు. ఆయన సతీమణి కూరగాయల ఉమారాణి. అయితే పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, రమేశ్ ఇద్దరూ మంచి మిత్రులు. కరాటేలో బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ దగ్గర రమేష్ శిక్షణ పొందారు. అలాగే రమేశ్ కాంగ్రెస్ పార్టీలో కొన్నేళ్లుగా కొనసాగుతున్నారు. బొమ్మ మహేష్‌కుమార్ (Bomma Mahesh Kumar) నేర్పిన కరాటే విద్యతో ఇప్పటికీ రమేష్ కరాటే శిక్షణ ఇస్తున్నారు. అనేకమంది క్రీడాకారులను జాతీయస్థాయి వరకు తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో రమేష్ సతీమణి కూరగాయల ఉమారాణిని ప్రస్తుతం 49వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థినిగా (Congress Candidate) నిలబడి విజయం సాధించింది. ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కూడా కూరగాయల రమేష్ పనిచేస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఆయన కార్పొరేటర్‌గా నిలబడి ఓడిపోయారు. ఈసారి ఆయన భార్య నిలబడి ఏకంగా ఛైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకున్నారు.
