అక్షరటుడే, ఇందూరు: Nizamabad mp arvind | కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్‌లను నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అర్వింద్ ధర్మపురి కలిశారు. బుధవారం ఢిల్లీలోని పార్లమెంట్ కార్యాలయంలో మంత్రులను వేర్వేరుగా కలిసి నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు సంబంధించి పలు విజ్ఞప్తులను అందజేశారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను (Railway Minister Ashwini Vaishnav) కలిసి నిజామాబాద్ రైల్వే స్టేషన్లో పిట్ లైన్ల ఏర్పాటు, పార్లమెంట్ నియోజకవర్గం మీదుగా పలు రైళ్ల పొడిగించాలని కోరారు. వందే భారత్ సహా పలు నూతన రైళ్ల మంజూరు, అయ్యప్ప స్వాముల కోసం కొల్లాంకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
Nizamabad mp arvind | గడ్కరీకి వినతి
అదేవిధంగా కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి గడ్కరీని కలిసి జగిత్యాల జిల్లాలో ఎన్‌హెచ్ 61, 63లలో హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణం, అంబారీపేట, అంతర్గాం గ్రామాల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాసుల నిర్మాణాలు చేపట్టాల్సిందిగా కోరారు. మంజూరుకు తక్షణమే మౌఖికంగా హామీ ఇచ్చి, సాంకేతికంగా మంజూరుకు తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
Nizamabad mp arvind | నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి
అనంతరం కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికేను సైతం కలిసిన ఎంపీ జగిత్యాల జిల్లాలో బోర్నపల్లి నుంచి జగన్నాథపూర్ వరకు హై లెవెల్ బ్రిడ్జిని చేపట్టాలని కోరారు. గిరిజన మంత్రిత్వ శాఖ ద్వారా నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.