అక్షరటుడే, ఇందూరు : Nizamabad Mayor Election | నిజామాబాద్ జిల్లా (Nizamabad District) అభివృద్ధి మా ప్రధాన ఎజెండా అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ ఎన్నిక (Mayor Election) అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
Nizamabad Mayor Election | అభివద్ధి కోసమే పొత్తు..
నిజామాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేదిశగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ముందుకు వెళ్తున్నామని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. తమది అనైతిక పొత్తు కాదని అభివృద్ధి కోసం కేవలం ప్రస్తుత ఎన్నికల్లో మాత్రమే కలిసి వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిజామాబాద్ మేయర్ ఎన్నిక చరిత్ర సృష్టించిందన్నారు. బీద కుటుంబం నుంచి వచ్చిన బీసీ బిడ్డకు మేయర్‌గా అవకాశం ఇచ్చామన్నారు. బీజేపీ నాయకులు (BJP Leaders) మతాన్ని రెచ్చగొట్టి సీట్లను దండుకుంటున్నారని ఆరోపించారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కూరగాయల ఉమారాణి
నగరంలోని 49వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచిన కూరగాయల ఉమారాణి మేయర్ ఎన్నికయ్యారు. ఆయన భర్త కూరగాయల రమేష్ (కరాటే రమేష్‌గా) సుపరిచితుడు. ఆయన సతీమణి ఉమారాణి 49వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. అయితే పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, రమేశ్ ఇద్దరూ మంచి మిత్రులు. కరాటే రమేశ్ ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) ఆయన కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఆయన భార్య ప్రస్తుతం ఛైర్పర్సన్ పీఠాన్ని అధిష్టించారు.