అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Inter Exams Security | ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
Nizamabad Inter Exams Security | జిల్లాలో 163 బీఎన్ఎస్..
ఇంటర్ పరీక్షల (Inter Exams) సందర్భంగా జిల్లాలో అండర్ సెక్షన్–163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని సీపీ పేర్కొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలోని 58 కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నాయన్నారు. ఈనెల 25వ తేదీనం నుంచి మార్చి 18 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు ఉన్నాయన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిషేదాజ్ఞలు విధించామని తెలియజేశారు.
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది..
పరీక్ష కేంద్రాల (Examination Centers) వద్ద ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడవద్దని సీపీ సూచించారు. నిషేధిత వస్తువులతో పరీక్ష కేంద్రాల వద్ద తిరగవద్దన్నారు. పరీక్షా కేంద్రం నుంచి 200 మీటర్ల వరకు పరిసర ప్రాంతాల్లోని అన్ని జిరాక్స్ సెంటర్లను (Xerox Centers) ఈనెల 25 నుండి మార్చి 18 వరకు ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.