అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | నిజామాబాద్ వైద్య కళాశాలలో (Nizamabad Medical College) పీజీ సీట్లు పెరిగాయని కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పీడియాట్రిక్ విభాగంలో నాలుగు పీజీ సీట్లు (PG seat) పెంచారని.. పాత మూడు సీట్లతో కలిపి ఇప్పుడు మొత్తం ఏడు పీజీ సీట్లు అయ్యాయన్నారు. డెర్మటాలజీ విభాగంలో (Dermatology departmen) నాలుగు పీజీ సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. పీజీ సీట్లు పెరగడంతో మరింత సేవలు మెరుగవుతాయని వారు హర్షం వ్యక్తం చేశారు. వైస్ ప్రిన్సిపాళ్లు డా. జలగం తిరుపతి రావు, డా. నాగమోహన్, డా. కిషోర్, హెచ్వోడీలు, ఫ్యాకల్టీ, ఆఫీస్ సూపరింటెండెంట్ నాగరాజు సహకారంతోనే సాధ్యమైందని తెలిపారు.