అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad Election Security | ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని సీపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు.
Nizamabad Election Security | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో..
నిజామాబాద్ కమిషనరేట్ (Nizamabad Commissionerate) పరిధిలో 59 అతి సమస్యాత్మక, 72 సమస్యాత్మక, 89 సాధారణ పోలింగ్ సెంటర్లుగా గుర్తించామని సీపీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయా సెంటర్ల వారీగా పోలీసు సిబ్బంది ఇప్పటికే కేటాయించామన్నారు. పోలీసు సిబ్బంది పోలింగ్ రోజు నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటారని ఆయన తెలిపారు.
Nizamabad Election Security | స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్..
కమిషనరేట్ పరిధిలో 39 రూట్ మొబైల్స్ వాహనాలు, ఏసీపీల ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశామని సీపీ (CP Sai Chaitanya) తెలిపారు. ఏడుగురు ఏసీపీలు, 70 మంది సీఐలు, ఎస్సైలు, 1,376 మంది సిబ్బందితో పోలింగ్‌కు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. అలాగే పోలింగ్ సెంటర్లలో ఎన్సీసీ సేవలను (NCC Services) సైతం వినియోగించుకుంటున్నామని చెప్పారు.
Nizamabad Election Security | హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫోర్స్..
ఇప్పటికే హైదరాబాద్ (Hyderabad) నుంచి జిల్లాకుస్పెషల్ ఫోర్స్ సైతం వచ్చిందని సీపీ సాయిచైతన్య తెలిపారు. పోలింగ్ సెంటర్ నుంచి 100 మీటర్ల వరకు ఎలాంటి వాహనాలకు అనుమతి లేదన్నారు. సెంటర్ల వద్ద దుకాణాలను కూడా మూసి ఉంచాలని, అలాగే సెల్ఫోన్లకు అనుమతి లేదని తెలిపారు. ఎవరైనా సెల్ఫోన్లను లోపలికి తీసుకెళ్లినట్లు తెలిస్తే కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. ప్రతి పోలింగ్ సెంటర్ సీసీ కెమెరాల నిఘాలో ఉంటుందని, సోషల్ మీడియాపై (Social Media) కూడా నిఘా పెట్టినట్టు తెలిపారు. ఇప్పటికే నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 67 ఆయుధాలను డిపాజిట్ చేసుకున్నామని సీపీ వెల్లడించారు.