ePaper
More
    HomeతెలంగాణTurmeric Board | పసుపు రైతుల కల నెరవేర్చాం : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

    Turmeric Board | పసుపు రైతుల కల నెరవేర్చాం : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Turmeric Board | పసుపు రైతుల దశాబ్దాల కలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి (Kishan Reddy) అన్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​ పసుపు సాగవుతున్నా.. ఈ ప్రాంతంపై ప్రేమతో ప్రధాని మోదీ (PM Modi), హోం మంత్రి అమిత్​ షా (Amit Shah)లు నిజామాబాద్​లో పసుపుబోర్డు కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేశారన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతు పక్షపాతి అని పేర్కొన్నారు. ఈ ప్రాంత రైతులకు కేంద్రం అండగా ఉంటుందన్నారు. రైతులకు ఎరువులకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుందన్నారు. ఇందుకోసం రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించిందని గుర్తు చేశారు.

    Turmeric Board | నిజామాబాద్​ జిల్లా వాళ్లు గొప్పోళ్లు

    నిజామాబాద్ జిల్లా (Nizamabad district) వారు గొప్ప వాళ్లని కేంద్ర మంత్రి బండి సంజయ్​ (Union Minister Bandi Sanjay) అన్నారు. ఎన్నో పోరాటాలు చేసి పసుపు బోర్డు సాధించారని ఆయన పేర్కొన్నారు. ఇందూరు రైతులు హీరోలు అని ఆయన అభివర్ణించారు. ఎంపీ అర్వింద్​ను ఢిల్లీలో పసుపు అర్వింద్​ (Turmeric Arvind) అంటున్నారని ఆయన పేర్కొన్నారు. పసుపు బోర్డు కోసం అర్వింద్​ ఎంతో కృషి చేశారన్నారు. రైతును రారాజు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పసుపు రైతుల పోరాటాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇందూరు కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.

    Turmeric Board | పసుపు ప్రతి ఒక్కరి జీవితంలో భాగం..

    పసుపు అనేది ప్రతిఒక్కరి జీవితంలో భాగంగా మారిందని.. అలాంటి పసుపు పంటపైనే తెలంగాణ రైతులు ఆధారపడి ఉన్నారని ఎంపీ అర్వింద్ (MP Arvind)​ పేర్కొన్నారు. అలాగే కశ్మీర్​లో 370 ఆర్టికల్ (Article 370)​ రద్దు నుంచి నక్సల్​ ముక్త్​ భారత్​ వరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్నో విజయాలు సాధించిందన్నారు. తాజాగా ఉగ్రవాదులను అంతం చేయడంలో సైతం భారత్​ చూపిన తెగువను ప్రపంచ దేశాలు అభినందిస్తున్నాయన్నారు. ఉగ్రవాదుల అంతం వరకు భారత ప్రభుత్వం చేస్తున్న కృషి ఎనలేనిదని స్పష్టం చేశారు. ప్రతి మహిళ సిందూరంలో పసుపు భాగమైందన్నారు. తెలంగాణలో రైతులంతా బీజేపీ (BJP) వెంటే ఉన్నారన్నారు. పసుపు రైతులపై ప్రేమతోనే నిజామాబాద్​ బిడ్డను జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్​గా ఎంపిక చేశారని గుర్తు చేశారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...