అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Padmashali Sangham | నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు మైసల నారాయణ ఆధ్వర్యంలో జిల్లా పద్మశాలి యువజన సంఘం (District Padmashali Youth Association) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నగరంలోని (Nizamabad city) ఖలీల్వాడిలోని కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు.
Padmashali Sangham | అధ్యక్షుడిగా పల్నాటి కార్తీక్..
జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడిగా పల్నాటి కార్తీక్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గజం అభిలాష్, జిల్లా కోశాధికారిగా గెంట్యాల అజయ్‌లను ఎన్నుకున్నారు. అనంతరం యువజన సంఘం సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు దాసరి నర్సింలు, జిల్లా అధ్యక్షుడు మైసల నారాయణ, సలహాదారులు గెంట్యాలు వెంకటేశ్, ఎస్.బాబురావు, చింతకింది సంతోష్, తదితరులు పాల్గొన్నారు.