అక్షరటుడే, ఇందూరు : Nizamabad Deputy Mayor | నిజామాబాద్ కార్పొరేషన్ (Nizamabad Corporation) డిప్యూటీ మేయర్‌గా సల్మా తహసీన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల కాంగ్రెస్ ఎంఐఎం పార్టీల పొత్తుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగానే ఎంఐఎంకు చెందిన 54వ డివిజన్ కార్పొరేటర్ సల్మాను డిప్యూటీ మేయర్ (Deputy Mayor)గా ఎన్నుకున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మేయర్ ఉమారాణి నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు ఫయాజ్, షకీల్, కార్పొరేటర్లు, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Nizamabad Deputy Mayor | ఇప్పటికే మేయర్ బాధ్యత స్వీకరణ..
మేయర్‌గా కూరగాయల ఉమారాణి బాధ్యతలు చేపట్టారు. ఈనెల16న కార్పొరేషన్ కార్యాలయంలో ఆమె ఛార్జ్ తీసుకున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
