అక్షరటుడే, ఇందూరు: Nizamabad CP | ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలువురి దగ్గర డబ్బులు వసూలు చేసిన కానిస్టేబుల్ చిన్నయ్యను శుక్రవారం సీపీ సాయి చైతన్య సస్పెండ్ చేశారు. ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిర్మల్ జిల్లా తెంభూర్తి గ్రామానికి చెందిన రావుల నాగభూషణం నుంచి కానిస్టేబుల్ కొన్ని నెలల క్రితం రూ. రెండు లక్షలు వసూలు చేశాడు. ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీనిపై నిజామాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇలా నిర్మల్, ఖానాపూర్ ప్రాంతాల్లో చాలామంది వద్ద రూ.లక్షలు వసూలు చేయడంతో పాటు ఆ డబ్బులు అధిక వడ్డీకి ఇతరులకు ఇచ్చినట్లు తేలింది. విచారణ చేపట్టిన అనంతరం చట్టపరమైన చర్యల్లో భాగంగా కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
Nizamabad CP | ఆర్మీలో ఉద్యోగమంటూ డబ్బులు వసూలు.. కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన సీపీ
Published on
