Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad CP | వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి: సీపీ

Nizamabad CP | వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి: సీపీ

- Advertisement -

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad CP | ఈదురు గాలులతో జిల్లా కేంద్రంలో విరిగిపడ్డ చెట్లు, విద్యుత్ స్తంభాలు వల్ల వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సీపీ సాయిచైతన్య(Cp Saichaitanya) పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో పర్యటించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో సోమవారం రాత్రి భారీ ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. జేసీబీల సహాయంతో చెట్లను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆపత్కాల పరిస్థితుల్లో ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. వెంటనే తగిన అందించేలా పోలీస్​ శాఖ పనిచేస్తుందని తెలిపారు. ప్రజల భద్రత కోసం పోలీసులు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.