అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ఇందల్వాయి పీఎస్ పరిధిలోని సిర్నాపల్లిలో(Sirnapalli) మాజీద్‌ఖాన్, అతని కుటుంబీకులపై పాత కక్షలతో తాళ్ల నవీన్, టేకుమల్ల మనోజ్, గొల్ల అశోక్, నిఖిల్, వడ్లూరి రంజిత్ కుమార్, రమేష్ కలిసి దాడి చేశారు. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ (investigation) జరిపినట్లు చెప్పారు. చర్యకు కారకులను సైతం గుర్తించి రిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. సమాజంలో ఉద్రిక్తతలు రేపేలా వ్యవహరిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి సమాచారం సమీపంలోని పోలీస్‌స్టేషన్, లేదా డయల్ 100, స్పెషల్ బ్రాంచ్ నంబర్ 87126–59777, పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 08462–226090కు సమాచారమివ్వాలని సూచించారు.
