అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Nizamabad Peace Meeting | సోషల్ మీడియాలో (Social Media) వచ్చే వదంతులను నమ్మరాదని, ప్రతిఒక్కరూ శాంతియుత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలని సీపీ సాయి చైతన్య సూచించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని మతాల పెద్దలతో సీపీ ఆఫీస్‌లో శనివారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.
Nizamabad Peace Meeting | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో..
జిల్లాలో ఉగాది, హోలీ, రంజాన్ పండుగల దృష్ట్యా శాంతి కమిటీ సమావేశం నిర్వహించామని సీపీ (CP Sai Chaitanya) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా (Nizamabad District) గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీక అన్నారు. అన్ని మతాల వారు సోదరభావంతో ఉండాలని సూచించారు. రంజాన్ మాసంలో మసీదుల వద్ద ప్రార్థనల సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
Nizamabad Peace Meeting | రెచ్చగొట్టే పోస్టులు పెడితే..
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. పుకార్లను నమ్మవద్దని సూచించారు. పండుగల వేళ అందరూ శాంతియుతంగా ఉంటూ పోలీస్‌శాఖ (Police Department)కు సహకరించాలని కోరారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా సంబంధిత పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని లేదా డయల్ 100ను సద్వినియోగపర్చుకోవాలని తెలిపారు. శాంతి కమిటీ సమావేశంలో పాల్గొన్న మతపెద్దలు ఈ సూచనలను ఆయా కాలనీల్లో ప్రజలకు వివరించాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ(అడ్మిన్) జి.బస్వారెడ్డి నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ ఏసీపీలు ప్రకాష్, శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సీఐలు, జిల్లాలోని అన్ని మతాల మతపెద్దలు తదితరులు పాల్గొన్నారు.