అక్షరటుడే, వెబ్డెస్క్: Nizamabad CP | డిచ్పల్లి, ధర్పల్లి పోలీస్ స్టేషన్లను సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టేషన్ ఆవరణలను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల (road accidents) నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గంజాయి నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఉంచాలన్నారు. సైబర్ మోసగాళ్ల (cyber fraudsters) బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. గేమింగ్ యాప్ల వల్ల ప్రజలు మోసపోకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఆయన వెంట సీఐలు మల్లేశ్, భిక్షపతి, ఎస్సైలు షరీఫ్, సుహాసిని, రామకృష్ణ, రాము, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
