Nizamabad CP | ఆర్మీలో ఉద్యోగమంటూ డబ్బులు వసూలు.. కానిస్టేబుల్​ను సస్పెండ్​ చేసిన సీపీ

అక్షరటుడే, ఇందూరు: Nizamabad CP | ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలువురి దగ్గర డబ్బులు వసూలు చేసిన కానిస్టేబుల్ చిన్నయ్యను శుక్రవారం సీపీ సాయి చైతన్య సస్పెండ్ చేశారు. ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిర్మల్ జిల్లా తెంభూర్తి గ్రామానికి చెందిన రావుల నాగభూషణం నుంచి కానిస్టేబుల్​ కొన్ని నెలల క్రితం రూ. రెండు లక్షలు వసూలు చేశాడు. ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీనిపై నిజామాబాద్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. ఇలా […]

అక్షరటుడే, ఇందూరు: Nizamabad CP | ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలువురి దగ్గర డబ్బులు వసూలు చేసిన కానిస్టేబుల్ చిన్నయ్యను శుక్రవారం సీపీ సాయి చైతన్య సస్పెండ్ చేశారు. ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిర్మల్ జిల్లా తెంభూర్తి గ్రామానికి చెందిన రావుల నాగభూషణం నుంచి కానిస్టేబుల్​ కొన్ని నెలల క్రితం రూ. రెండు లక్షలు వసూలు చేశాడు. ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీనిపై నిజామాబాద్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. ఇలా నిర్మల్, ఖానాపూర్ ప్రాంతాల్లో చాలామంది వద్ద రూ.లక్షలు వసూలు చేయడంతో పాటు ఆ డబ్బులు అధిక వడ్డీకి ఇతరులకు ఇచ్చినట్లు తేలింది. విచారణ చేపట్టిన అనంతరం చట్టపరమైన చర్యల్లో భాగంగా కానిస్టేబుల్​ను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...