అక్షరటుడే, ఇందూరు : Nizamabad Corporation Results | నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Nizamabad Municipal Corporation) ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. ప్రస్తుతం తొలి రౌండ్ ఫలితాలు వెలువడుతున్నాయి.
Nizamabad Corporation Results | 45వ డివిజన్లో..
45వ డివిజన్లో తొలి రౌండ్ ఫలితాల్లో బీజేపీ (BJP) స్పష్టమైన ఆదిక్యం కనబర్చింది. బీజేపీ అభ్యర్థి బొబ్బిలి సువర్ణకు 832 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి కస్తూరి భవాని 95, బీఆర్ఎస్ తోట మౌనిక 42 ఓట్లు పోలయ్యాయి.
52వ డివిజన్లో..
52వ డివిజన్లో తొలి రౌండ్ ఫలితాల్లో ఎంఐఎం ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం అభ్యర్థి షకీల్ అహ్మద్‌కు 564 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి అలీమొద్దీన్ 61 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కిరణ్‌కుమార్ 109 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి ఇఫ్తాకర్ అహ్మద్‌కు 186 ఓట్లు వచ్చాయి.
53వ డివిజన్లో..
53వ డివిజన్లో తొలి రౌండ్ ఫలితాల్లో ఎంఐఎం ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం అభ్యర్థి హీనా కౌసర్ 806 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి షహీన్ బేగంకు 158 ఓట్లు పోలయ్యాయి.
56వ డివిజన్లో..
53వ డివిజన్లో తొలి రౌండ్ ఫలితాల్లో ఎంఐఎం ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం అభ్యర్థి హీనా కౌసర్ 806 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి షహీన్ బేగంకు 158 ఓట్లు పోలయ్యాయి.
26వ డివిజన్లో..
26వ డివిజన్లో తొలి రౌండ్లో ఫలితాల్లో బీజేపీ అధిక్యంలో ఉంది. బీజేపీ అభ్యర్థి బంటు 400 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి సిర్పరాజు 336 ఓట్లు పోలయ్యాయి.
10వ డివిజన్లో..
10 డివిజన్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థికి 403 ఓట్లు, బీజేపీకి 252 ఓట్లు వచ్చాయి.
43వ డివిజన్..
43వ డివిజన్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థికి 482 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 321 ఓట్లు పోలయ్యాయి.
33వ డివిజన్..
33వ డివిజన్లో.. కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.. కాంగ్రెస్ అభ్యర్థిని ఫరా నాజ్‌కు 480 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థినికి 153 ఓట్లు వచ్చాయి.
32వ డివిజన్..
32వ డివిజన్లో.. ఎంఐఎం ఆధిక్యంలో ఉంది.. ఎంఐఎం అభ్యర్థిని సారా అమీనాకు 760 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థినికి 212 ఓట్లు వచ్చాయి.