అక్షరటుడే, ఇందూరు : Nizamabad counting tension | నిజామాబాద్ (Nizamabad) కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రం బయట స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయా రాజకీయ పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. నిబంధనల ప్రకారం ఎటువంటి ర్యాలీలకు అనుమతులు లేనందున పోలీసులు వారిని అక్కడి నుంచి పంపివేశారు.
నగరంలోని పలు డివిజన్లలో ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) మధ్య పోరు తీవ్రంగా ఉంది. మరోవైపు ఎంఐఎం సైతం పలు స్థానాల్లో విజయం సాధించింది. తుది ఫలితాలు వచ్చే వరకు కార్పొరేషన్ పీఠం ఎవరిదో చెప్పలేని పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో అన్ని వార్డుల ఫలితాలు లేలనున్నాయి.