అక్షరటుడే, ఇందూరు : Nizamabad Corporation Counting | నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధానపార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి.
Nizamabad Corporation Counting | మెదటి రౌండ్లో..
మెదటి రౌండ్లోలో భాగంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థినిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థిని శమంత వెనుకంజలో ఉంది. ఇక బీజేపీ మేయర్ అభ్యర్థిని స్రవంతి రెడ్డి (Sravanthi Reddy) ముందంజలో ఉన్నారు. ఇక 45వ డివిజన్లో బీజేపీ అభ్యర్థిని బొబ్బిలి సువర్ణ, 44వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి బట్టు రాఘవేందర్ విజయం సాధించారు. అలాగే 6వ డివిజన్, 1, 2, 4, 6, 10, 19, 25, 26, 45 డివిజన్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
పోటాపోటీగా ప్రచారం..
ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ (Indore Municipal Corporation) ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్,బీజేపీ, బీఆర్ఎస్లు పోటాపోటీ ప్రచారం నిర్వహించాయి. అభ్యర్థుల ఎంపికలోనూ ఆచీతూచి వ్యవహరించాయి. ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో రూ.లక్షల్లో ఖర్చు చేసినట్లు సైతం ప్రచారం జరిగింది. అయితే మరికొద్ది సేపట్లో తుది ఫలితాలు రానున్నాయి.