అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | ప్రభుత్వ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తూ.. లక్ష సాధనకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు.
కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Housing Scheme) నిర్మాణాలు, భూసేకరణ, భారీ వర్ష సూచన నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, భూభారతి తదితరాంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూభారతి (Bhubarathi) రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను కేటగిరీల వారీగా విభజిస్తూ.. సత్వరమే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఆగస్టు 15 లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు.
Nizamabad Collector | లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి..
అలాగే భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల్లో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కొత్త రేషన్ కార్డులు (ration cards), పేర్ల నమోదు దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా అర్హులకు మంజూరు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చేపట్టేలా.. వారికి ఉచితంగా ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Nizamabad Collector | ఎడపల్లి తహశీల్ కార్యాలయం తనిఖీ
అక్షరటుడే, బోధన్: ఎడపల్లి తహశీల్దార్ (Yedapally tahasildar) కార్యాలయాన్ని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 833 దరఖాస్తులు వచ్చాయని తహశీల్దార్ దత్తాత్రేయ తెలుపగా, దరఖాస్తుదారులకు రశీదులు అందించారా..? అని కలెక్టర్ ఆరా తీశారు. కొత్తగా రేషన్ కార్డుల కోసం, కుటుంబ సభ్యుల పేర్ల నమోదు కోసం వచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. కార్యాలయంలోని పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేసి అధికారులకు సూచించారు.
