అక్షరటుడే, వెబ్‌డెస్క్: IAS Transfers | నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. ఇక్కడికి వచ్చిన అతి కొద్ది నెలల్లోనే ఆయన బదిలీ కావడం తీవ్ర చర్చకు దారితీసింది.
కాగా.. నూతన కలెక్టర్‌గా ఇలా త్రిపాఠీ (Tripathi) నియమితులయ్యారు. 2017 బ్యాచ్‌కు చెందిన ఆమె ప్రస్తుతం నల్గొండ జిల్లా కలెక్టర్‌గా (Nalgonda district) వ్యవహరిస్తున్నారు. వినయ్ కృష్ణారెడ్డి జీహెచ్ఎంసీ పరిధిలోని మల్కాజ్గిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్లకు అడిషనల్ కమిషనర్‌గా నియమించారు.
ఆరు నెలల్లోనే బదిలీ
నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా వినయ్ కృష్ణారెడ్డి జూన్‌లో నియమితులయ్యారు. కాగా.. అప్పటి నుంచి సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలను సైతం ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పూర్తయ్యేలా ముందుండి నడిపించారు. అతిత్వరలోనే జరిగే మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమీక్షలు సైతం నిర్వహిస్తున్నారు. కాగా.. ఇంతలోనే ఆయనను అనూహ్యంగా బదిలీ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. జిల్లాకు చెందిన పెద్దాయన లేదా రాష్ట్రస్థాయి పదవిలో ఉన్న నేత ప్రమేయంతోనే కలెక్టర్ బదిలీ జరిగినట్లు చర్చ సాగుతోంది.