అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా టి.వినయ్ కృష్ణారెడ్డి (T. Vinay Krishna Reddy) శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4:45 గంటల సమయంలో కలెక్టరేట్‌కు చేరుకున్న పాలనాధికారి తన ఛాంబర్లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తదితరులతో భేటీ అయ్యారు. స్థానిక పరిస్థితుల గురించి చర్చించారు. ఆయా శాఖల అధికారులు కలెక్టర్‌ను కలిసి పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీవో రాజా గౌడ్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Nizamabad Collector | నిజామాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వినయ్ కృష్ణారెడ్డి
Published on
