ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Collectors Transfer | నిజామాబాద్​ కలెక్టర్​ బదిలీ.. కొత్త కలెక్టర్​ ఎవరంటే..

    Collectors Transfer | నిజామాబాద్​ కలెక్టర్​ బదిలీ.. కొత్త కలెక్టర్​ ఎవరంటే..

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Collectors Transfer : నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు బదిలీ అయ్యారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖ స్పెషల్​ సెక్రెటరీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్​గా, భూభారతి కమిషనర్​ గానూ అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (Chief Secretary Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు.

    నిజామాబాద్​ నూతన కలెక్టర్​(Nizamabad New Collector)గా టీ.వినయ్​ కృష్ణారెడ్డి (2013 ఐఏఎస్​ బ్యాచ్​) T. Vinay Krishna Reddy (2013 IAS batch) రాబోతున్నారు. ఈయన ప్రస్తుతం ఐ అండ్​ క్యాడ్​ కమిషనర్​గా ఉన్నారు. జీహెచ్​ఎంసీ(GHMC) అడిషనల్​ కమిషనర్​గా కూడా కొనసాగుతున్నారు.​ గతంలో సూర్యాపేట, 2022 – 23 నల్గొండ కలెక్టర్​గా చేశారు. R&R , LA (పునరావాసం & పునరావాసం మరియు భూసేకరణ), I&CAD (నీటిపారుదల & కమాండ్ ఏరియా అభివృద్ధి) శాఖ కమిషనర్‌గా కూడా కొనసాగారు.

    కాగా.. బదిలీపై వెళ్తున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు 2023 ఫిబ్రవరిలో నిజామాబాద్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. ముఖ్యంగా ఎన్నికలు సాఫీగా సాగడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు తాజాగా కీలక శాఖలకు కమిషనర్ బాధ్యతలు కట్టబెట్టింది.

    More like this

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...