Nizamabad Collector | డ్రగ్స్‌ నియంత్రణకు సమష్టిగా కృషిచేయాలి

అక్షరటుడే, ఇందూరు: Nizamabad collector | జిల్లాలో గంజాయి, క్లోరోఫాం, అల్ప్రాజోలం వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నియంత్రణకు ఆయా శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanmantu), సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ (District Level Anti-Narcotics Committee) సమన్వయ సమావేశంలో మాట్లాడారు. యువత, విద్యార్థులు (youth and students) డ్రగ్స్‌ […]

అక్షరటుడే, ఇందూరు: Nizamabad collector | జిల్లాలో గంజాయి, క్లోరోఫాం, అల్ప్రాజోలం వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నియంత్రణకు ఆయా శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanmantu), సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ (District Level Anti-Narcotics Committee) సమన్వయ సమావేశంలో మాట్లాడారు. యువత, విద్యార్థులు (youth and students) డ్రగ్స్‌ బారిన పడకుండా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకుగాను స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలన్నారు.

విద్యాసంస్థలకు వంద మీటర్లలోపు పాన్‌షాపులు, సిగరెట్, గుట్కా, నికోటిన్‌ పదార్థాల విక్రయాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. డ్రగ్స్‌కు బానిసగా మారినవారికి డీ అడిక్షన్‌ సెంటర్‌లో కౌన్సెలింగ్‌ (Counseling at the De-Addiction Center) ఇప్పించాలన్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మెడికల్‌ షాపుల్లో (medical shops) నిషేధిత ఔషధాలు విక్రయించకుండా తనిఖీలు చేపట్టాలన్నారు. ఆంధ్ర, ఒడిశా నుంచి మత్తు పదార్థాల రవాణ జరగకుండా రైల్వే అధికారులు పక్కాగా పర్యవేక్షించాలన్నారు. అలాగే కల్తీ కల్లుపై సైతం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ మల్లారెడ్డి, డీఎంహెచ్‌ఓ రాజశ్రీ, డీఐఈవో రవికుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related articles

Ramchander Rao Arrest | బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అరెస్ట్..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ramchander Rao Arrest | బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావును పోలీసులు అరెస్ట్​ చేశారు. కామారెడ్డి (Kamareddy), బాన్సువాడ...

Gurugram live-in attack | పెళ్లి చేసుకోమ‌న్నందుకు దారుణం.. యువతిపై శానిటైజర్ పోసి నిప్పంటించిన ప్రియుడు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gurugram live-in attack | హర్యానాలోని గురుగ్రామ్ (Gurugram)లో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో దగ్గరై...

Telangana Rain Alert | ఉరుములతో కూడిన వర్ష సూచన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Rain Alert | నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని (Telugu States)...

Maoist Leader Devji Surrender | మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. లొంగిపోయిన దేవ్​జీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Leader Devji Surrender | మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్ర నేతలు దేవ్​జీ,...