అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలో వినాయక ఉత్సవాలు (Ganesh Festival) ఘనంగా జరుగుతున్నాయి. ఆయా మండళ్ల వద్ద మహిళలు, చిన్నారులు రాత్రివేళల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఉత్సాహంగా ఆడిపాడుతున్నారు. కోలాటాలు వేస్తూ భక్తి పాటలు ఆలపిస్తూ సందడి చేస్తున్నారు.
Nizamabad City | గాజులు వేసే కార్యక్రమం..
వినాయక మండపాల్లో స్నేహితులకు గాజుల (Bangles Festival) పేరిట ఈమధ్య వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలు ఒకరికొకరు గాజులను మార్చుకుంటూ.. గోరింటాకు పెట్టుకుని.. ఒకేచోట భోజనాలు చేయడంలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు.
Nizamabad City | బొబ్బిలివీధిలో..
నగరంలోని బొబ్బిలివీధిలో (Bobbili Veedhi) గణేష్ మండలి ప్రాంగణంలో మహిళా స్నేహితులకు గాజుల వేసే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. మహిళలు ఒకరికొకరు గాజులు వేసుకుంటూ మురిసిపోయారు. అనంతరం గణేశ్ మండలి (Ganesh Mandals) ప్రాంగణంలో మహిళలు కబడ్డీ (Kabaddi), ఖోఖో (Kho Kho) ఆడారు. ఉత్సాహంగా దాండియా (Dandiya) నృత్యాలు ఆడారు. కార్యక్రమంలో రాధిక, సాధన, హర్షిత,రంజిత, లత, స్వప్న, స్రవంతి, వెన్నెల, నవనీత, శ్రావ్య, కాజోల్, అక్షర, లావణ్య, అరుణ, కవిత, కమల, కాలనీవాసులు పాల్గొన్నారు.