ePaper
More
    HomeతెలంగాణNizamabad City | ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి

    Nizamabad City | ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలోని పారిశుధ్యాన్ని మెరుగుపర్చి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సీపీఐ (ఎంఎల్)మాస్ లైన్( ప్రజా పంథా) నగర కార్యదర్శి సుధాకర్ అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం (Municipal Corporation office) ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరంలోని మెజారిటీ డివిజన్లో రోడ్లు, డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా మారాయన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ జరగడంలేదని తెలిపారు. డెంగీ, మలేరియా (dengue, malaria) తదితర విషజ్వరాల కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.

    కుక్కలు, కోతుల (dogs and monkeys) సమస్య నగరవాసులను తరచూ ప్రమాదాలకు గురి చేస్తుందన్నారు. డ్రెయినేజీ, పైప్​లైన్, తాగునీటి పైప్​లైన్ల (drinking water pipelines) లీకేజీలకు గురై నీరు కలుషితమవుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా పారిశుధ్యం, మౌలిక సౌకర్యాలకు ప్రభుత్వం నిధులు కేటాయించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని అన్నారు.

    లోతట్టు ప్రాంతాల్లో పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రోడ్లు, డ్రెయినేజీలకు (drainages) మరమ్మతులు చేపట్టాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి, పీడీఎస్​యూ జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్, ఉపాధ్యక్షుడు సాయిబాబా, నాయకులు విఠల్, గంగాధర్, కిరణ్, అమూల్య, సాయిలు, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    ACB Case | ఇందిరమ్మ ఇళ్ల కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Case | రాష్ట్రంలో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల...

    SP Rajesh Chandra | మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనాన్ని ప్రారంభించిన ఎస్పీ

    అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | జిల్లాలో ఫోరెన్సిక్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర...

    Gol Hanuman Temple | గోల్​​ హనుమాన్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Gol Hanuman Temple | నగరంలోని గోల్​ హనుమాన్​ ఆలయ నూతన పాలకవర్గం గురువారం...

    Earth Store | హైదరాబాద్‌లో సందడి చేసిన శ్రియా.. ‘అర్థ్’ స్టోర్​ను ప్రారంభించిన నటి..

    అక్షరటుడే, హైదరాబాద్ : Earth Store | సినీ నటి శ్రియా(Actress Shriya) హైదరాబాద్​లో సందడి చేసింది. కొండాపూర్‌లోని...

    More like this