అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలోని పారిశుధ్యాన్ని మెరుగుపర్చి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సీపీఐ (ఎంఎల్)మాస్ లైన్( ప్రజా పంథా) నగర కార్యదర్శి సుధాకర్ అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం (Municipal Corporation office) ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరంలోని మెజారిటీ డివిజన్లో రోడ్లు, డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా మారాయన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ జరగడంలేదని తెలిపారు. డెంగీ, మలేరియా (dengue, malaria) తదితర విషజ్వరాల కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.
కుక్కలు, కోతుల (dogs and monkeys) సమస్య నగరవాసులను తరచూ ప్రమాదాలకు గురి చేస్తుందన్నారు. డ్రెయినేజీ, పైప్లైన్, తాగునీటి పైప్లైన్ల (drinking water pipelines) లీకేజీలకు గురై నీరు కలుషితమవుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా పారిశుధ్యం, మౌలిక సౌకర్యాలకు ప్రభుత్వం నిధులు కేటాయించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని అన్నారు.
లోతట్టు ప్రాంతాల్లో పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రోడ్లు, డ్రెయినేజీలకు (drainages) మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్, ఉపాధ్యక్షుడు సాయిబాబా, నాయకులు విఠల్, గంగాధర్, కిరణ్, అమూల్య, సాయిలు, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.