అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nizamabad | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం (అక్టోబరు 16) ఉదయం ఓ కారును ఆర్టీసీ బస్సు RTC bus ఢీకొంది.
Nizamabad | లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్ టేక్ చేయబోయి..
నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ (Kanteshwar Bypass) వద్ద ఈ ప్రమాదం జరిగింది. నిజామాబాద్ వైపు వెళ్తున్న బస్సును ఓ కారు CAR నడుపుతున్న వ్యక్తి ఓవర్ టేక్ చేయబోయాడు.
అయితే, కారు డ్రైవర్ లెఫ్ట్ సైడ్ నుంచి బస్సును దాటే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో బస్సును ఆర్టీసీ డ్రైవర్ లెఫ్ట్ సైడ్‌కు మలపడంతో ఈ ప్రమాదం సంభించింది.
ఈ ఘటనలో కారు స్వల్పంగా ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తువారిలో ఎవరూ గాయపడలేదు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు శంకర్, రాములు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.