5
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nizamabad | ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీపీ (AP Additional DGP) గౌరవ్ సంజయ్ బుధవారం జిల్లాకు వచ్చారు. ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం నగరానికి వచ్చారు. ఈ క్రమంలో మర్యాదపూర్వకంగా సీపీని కలిశారు. ఆయనతో పాటు ఈఆర్ ఫౌండేషన్ ఛైర్మన్, చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్, హైదరాబాద్ ఇమ్మనీయల్, అర్గుల్ సురేష్, సడక్ ప్రమోద్, రాంప్రసాద్ ఉన్నారు. అనంతరం అడిషనల్ డీజీపీ ఆర్మూర్‌లోని రాజశేఖర్ ఇంటికి వెళ్లారు. ఏఆర్ ఫౌండేషన్ ద్వారా ఆయన అందిస్తున్న సేవలను అభినందించారు.