Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | మద్యం మత్తులో గొడవ.. ఇద్దరికి గాయాలు

Nizamabad | మద్యం మత్తులో గొడవ.. ఇద్దరికి గాయాలు

నిజామాబాద్​ నగరంలో ఇద్దరు తాగిన మైకంలో గొడవ పడ్డారు. అనంతరం దాడులు చేసుకోవడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Nizamabad | నగరంలోని చంద్రశేఖర్​ కాలనీకి చెందిన దేవకత్​ ఆకాశ్​ (36), కెంగార్​ మాణిక్​ కలిసి మద్యం తాగారు. అనంతరం ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆకాశ్​పై మాణిక్ దాడి చేశాడు.

ఈ విషయం తెలిసిన ఆకాశ్​ తల్లి పంచాషీల, తమ్ముడు అరుణ్​ కలిసి మాణిక్​ ఇంటికి అడగటానికి వెళ్లారు. ఈ క్రమంలో మళ్లీ గొడవ జరగడంతో మాణిక్​ ఇంట్లో నుంచి కత్తి తీసుకొని వచ్చి ఆకాశ్​ తలపై దాడి చేశాడు. దీంతో ఆకాశ్​ తమ్ముడు అరుణ్​ బండరాయితో మాణిక్​పై దాడి చేశాడు. కాలనీ వాసుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ ఆకాశ్​, మాణిక్​ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.