అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nitish Rana | డిల్లీలో జరుగుతున్న ప్రీమియర్ లీగ్ (DPL) 2025 టోర్నమెంట్‌లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ కెప్టెన్ నితీష్ రాణా తన అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ పై 8 వికెట్ల తేడాతో గెలిచిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, తన ఫామ్‌కు మతపరమైన విశ్వాసమే బలమని చెప్పారు. నేను బ్యాటింగ్ చేయడానికి క్రీజ్‌లో దిగేటప్పుడు జేబులో హనుమాన్ చాలీసా(Hanuman Chalisa) పెట్టుకుని ఉంటాను. అదే నాకు శక్తిని ఇస్తుంది అని నితీష్ పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి. వ్యక్తిగత విశ్వాసాన్ని ఇలా బహిరంగంగా చెప్పిన క్రికెటర్‌గా నితీష్ ప్రత్యేకంగా నిలిచారు.
Nitish Rana | భక్తి భావం..
క్వాలిఫయర్ 2 మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఈస్ట్ ఢిల్లీ రైడర్స్(Delhi Riders) 20 ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేశారు. వారి బ్యాటర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిపోవడంతో,లక్ష్యం చిన్నదైంది. ఇక చేజింగ్‌లో వెస్ట్ ఢిల్లీ లయన్స్(Delhi Lions) ఓపెనర్ అంకిత్ కుమార్ త్వరగా ఔటైనా, క్రిష్ యాదవ్ (37), ఆయుష్ దోసెజా (54) కలిసి జట్టును నిలబెట్టారు.ఆ తర్వాత నితీష్ రాణా (Nitish Rana) 26 బంతుల్లో 45 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు.దోసెజా 49 బంతుల్లో 54 పరుగులు చేయడం విశేషం. మొత్తానికి క్వాలిఫయర్ 2లో విజయం సాధించి వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు డీపీఎల్ 2025 ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఫైనల్లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ జట్టుతో తలపడనున్న వెస్ట్ ఢిల్లీ లయన్స్‌కు ఇది గట్టి సవాలే. ఇరు జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా ఉండనుంది. నితీష్ రాణా ఫామ్ చూస్తే, ఆయన ఫైనల్‌లోనూ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. నితీష్ రాణా చేసిన హనుమాన్ చాలీసా వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చించబడుతున్నాయి. ఆటగాళ్లు తమ ఆటతీరులో భౌతిక శిక్షణతో పాటు మానసిక స్థైర్యం, విశ్వాసం కూడా ఎంత ముఖ్యమో నితీష్ మరోసారి రుజువు చేశారు. టీమిండియా(Team India)లో ఛాన్స్ కోసం నితీష్ ఎంతగానో కృషి చేస్తున్నారు. రానున్న రోజులలో అయిన ఆయనకి ఛాన్స్ దక్కుతుందో లేదో చూడాలి.