Nitish Kumar Reddy
Nitish Kumar Reddy | తొలి టెస్ట్ ఓట‌మితో రెండో టెస్ట్ కోసం టీమ్‌లో భారీ మార్పులు.. హైదరాబాద్ కుర్రాడికి పిలుపు!

అక్షరటుడే, వెబ్​డెస్క్:Nitish Kumar Reddy | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ జట్టు తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఈ ఫలితంతో జట్టు తీరుపై మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా జట్టు ఎంపిక, బౌలింగ్ ఆమోదయోగ్యంగా లేదన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక జులై 2 నుంచి బర్మింగ్ హామ్‌లో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌ (Second Test) కోసం భారత జట్టు మేనేజ్‌మెంట్ కీలక మార్పులు చేపట్టే ఆలోచనలో ఉంది. తొలి టెస్టులో అంత‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయిన‌ శార్దూల్ ఠాకూర్ స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ ను తుది జట్టులోకి తీసుకోవాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు.

Nitish Kumar Reddy | ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌..

శార్దూల్‌ను ఎంపిక చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Captain Shubman Gill) నిర్ణయానికి కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతిచ్చినా, ఇప్పుడు విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డంతో బౌలింగ్ కూర్పుపై పునఃపరిశీలన చేయాల్సిందే అంటున్నారు. దిలీప్ వెంగ్‌సర్కార్ అభిప్రాయం ప్ర‌కారం, బర్మింగ్ హామ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నందున, జడేజా -కుల్దీప్ కాంబినేషన్ అవసరమని చెబుతున్నారు. తొలి టెస్టులో కుల్దీప్ ఆడుంటే ఫలితం వేరేలా ఉండేదని సంజ‌య్ మంజ్రేక‌ర్ అన్నారు. రెండో టెస్టులో కచ్చితంగా కుల్దీప్ ఉండాలి. అవసరమైతే నితీశ్ రాణా(Nitish Rana) లాంటి ఆటగాళ్లను కూడా ఆడించాలి. అతను ఆసీస్‌లో మంచి ప్రదర్శన చేశాడు అంటూ సంజ‌య్ చెప్పుకొచ్చాడు..

ఇప్పటికే సిరీస్‌లో ఇండియా టీం (Indian Team) వెన‌క‌బ‌డి ఉన్నందున తిరిగి బలంగా నిలబడాలంటే రెండో టెస్టులో విజయం తప్పనిసరి. అందుకోసం సమర్ధవంతమైన బౌలింగ్ అటాక్, సమతుల్య జట్టు కూర్పుపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. వీటిన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, రెండో టెస్టుకు జట్టు ఎంపికపై బీసీసీఐ(BCCI), మేనేజ్‌మెంట్ తీవ్రమైన కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. మరి ఈసారి టీమిండియా సరికొత్త వ్యూహంతో విజయం సాధిస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.