అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BJP President | బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్ (Nitin Nabin) నియమితులయ్యారు. బీహార్‌కు చెందిన ఆయనను నియమిస్తూ ఆదివారం పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. నియామకం తక్షణం అమలులోకి వస్తుందని తెలిపింది.
బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడి నియామకం విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. 2020లో నియామకం అయిన జేపీ నడ్డా (JP Nadda) పదవి కాలం గతంలోనే అయిపోయింది. అయితే 2024 లోక్‌సభ ఎన్నికలతో సహా పలు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో ఆయన పదవి కాలాన్ని పొడిగిస్తూ వచ్చారు. కొంతకాలంగా పార్టీ జాతీయ అధ్యక్షుడి కోసం కీలక కసరత్తు జరిగింది. పలువురి పేర్లు రేసులో వినిపించాయి. అనుహ్యంగా బీహార్ మంత్రిగా పని చేస్తున్న నితిన్ నబిన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపిక చేసింది.
BJP President | నబిన్ నేపథ్యం..
కాయస్థ కులానికి చెందిన నబిన్, ప్రస్తుత బీజేపీ చీఫ్ నడ్డా స్థానంలో నియమితులవుతారు. పాట్నాలోని బంకిపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన బీహార్‌లో పిడబ్ల్యుడీ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన తండ్రి నబిన్ కిషోర్ సిన్హా బీజేపీలో కీలకంగా వ్యవహరించారు. నితిన్ నబిన్ 2010లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పట్టణ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిన నాయకుడిగా ఎదిగారు. యువమోర్చాతో విస్తృతంగా పనిచేసిన నబిన్ ఇటీవల పలు బాధ్యతల్లో చురుగ్గా పని చేశారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల సమయంలో ఆయన ఇన్ఛార్జిగా ఉండగా ఆ రాష్ట్రంలో బీజేపీ భారీ విజయం సాధించింది.
BJP President | మోదీ అభినందనలు
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నబిన్‌ను ప్రధాని మోదీ (PM Modi) ఎక్స్ వేదికగా అభినందించారు. సంస్థాగత అనుభవం కలిగిన శ్రమశక్తిగల నాయకుడని అభివర్ణించారు. బీహార్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేకసార్లు అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నారని చెప్పారు. ఆయన శక్తి, అంకితభావం రాబోయే కాలంలో పార్టీని బలోపేతం చేస్తాయని ఆయన ఆకాంక్షించారు.