ePaper
More
    HomeజాతీయంNITI Aayog CEO | నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థగా భార‌త్‌.. నీతి ఆయోగ్ సీఈవో...

    NITI Aayog CEO | నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థగా భార‌త్‌.. నీతి ఆయోగ్ సీఈవో సుబ్ర‌హ్మ‌ణం వెల్ల‌డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: NITI Aayog CEO | అభివృద్ధిలో దూసుకుపోతున్న భార‌త్ ప్ర‌పంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా అధిగ‌మించింద‌ని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం (NITI Aayog CEO BVR Subrahmanyam) వెల్ల‌డించారు.

    2024 వ‌ర‌కు నాలుగు ట్రిలియ‌న్ డాల‌ర్ల జీడీపీతో (trillion dollars GDP) నాలుగో స్థానంలో జ‌పాన్ ను వెన‌క్కి నెట్టిన భారత్ ఆ స్థానాన్ని చేరుకుందని వెల్ల‌డించారు. ‘విక‌సిత్ రాజ్య్ ఫ‌ర్ విక‌సిత్ భార‌త్‌-2047’ అంశంపై జ‌రిగిన 10వ నీతిఆయోగ్ మండ‌లి స‌మావేశం త‌ర్వాత సుబ్ర‌హ్మ‌ణం విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. భార‌త విజ‌య ప్ర‌స్థానాన్ని వెల్ల‌డించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డేటాను ఉటంకిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ (Indian economy) 4 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకున్నట్లు తెలిపారు.

    NITI Aayog CEO | జపాన్‌ను అధిగ‌మించిన ఇండియా

    నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా (fourth largest economy) ఉన్న జ‌పాన్‌ను ఇండియా అధిగ‌మించింద‌ని నీతి ఆయోగ్ సీఈవో తెలిపారు. “నేను చెప్పినట్లుగా మనం నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. మ‌నం 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకున్నాం. ఇది నా డేటా కాదు. IMF వెల్ల‌డించిన డేటా. నేడు భారతదేశం జపాన్ (Japan) కంటే అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా అవ‌త‌రించింది. యునైటెడ్ స్టేట్స్ (United States), చైనా, జర్మనీ (China and Germany) మాత్రమే మ‌న‌క‌న్నా ముందున్నాయి. మన ప్రణాళికలు, ఆలోచ‌న‌లను అమ‌లు చేస్తే మరో రెండు, మూడేళ్ల‌లో మనం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతామ‌ని” సుబ్రహ్మణ్యం వెల్ల‌డించారు.

    NITI Aayog CEO | 4 వేల బిలియ‌న్ డాల‌ర్ల‌కు జీడీపీ

    త్వ‌ర‌లోనే ఇండ‌యా జీడీపీ (India GDP) 4,187.017 బిలియన్ డాల‌ర్లకు చేరుకుంటుంద‌ని అంచనా వేస్తున్నారు. IMF వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ నివేదిక (IMF World Economic Outlook report) ఏప్రిల్ ఎడిషన్ ప్రకారం. 2026 ఆర్థిక సంవత్సరానికి ఇండియా నామినల్ జీడీపీ సుమారు 4,187.017 బిలియన్ డాల‌ర్ల‌కు చేరుకుంటుందని అంచనా వేసింది.

    రాబోయే రెండేళ్లలో ఇండియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ప్రపంచ ఆర్థిక సంస్థ అంచనా వేసింది. భారత ఆర్థిక వ్యవస్థ 2025లో 6.2 శాతం, 2026లో 6.3 శాతం వృద్ధి చెందుతుందని, ప్రపంచ సహచరుల కంటే ఘనమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తుందని వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ (World Economic Outlook) ఏప్రిల్ నివేదిక వెల్ల‌డించింది. ఇది ప్రపంచ ఆర్థిక దృశ్యంలో ఇండియా ఆధిపత్యాన్ని పునరుద్ఘాటిస్తుంది. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2025లో 2.8 శాతం, 2026లో 3.0 శాతంగా ఉంటుందని IMF అంచనా వేసింది.

    Latest articles

    Raja Singh | బీజేపీలో చేరికలపై రాజాసింగ్​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Raja Singh | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh)​ బీజేపీ (BJP)పై మరోసారి...

    TNGO’S Nizamabad | అంగన్​వాడీల సమస్యలను పరిష్కరించాలి

    అక్షరటుడే, ఇందూరు: TNGO'S Nizamabad |అంగన్​వాడీ (Anganwadi) ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవోస్ (TNGO'S Nizamabad)​ జిల్లా...

    Nizamsagar | బస్సులో నుంచి కిందపడి విద్యార్థికి గాయాలు

    అక్షర టుడే, నిజాంసాగర్‌: Nizamsagar | బస్సులో నుంచి కిందపడి విద్యార్థికి గాయాలైన ఘటన మండలకేంద్రంలో జరిగింది. స్థానికులు...

    Union Cabinet | లక్నోలో మెట్రో విస్తరణకు నిధులు మంజూరు.. మరోసారి హైదరాబాద్​కు మొండిచేయి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Union Cabinet | కేంద్ర కేబినెట్​ మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో...

    More like this

    Raja Singh | బీజేపీలో చేరికలపై రాజాసింగ్​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Raja Singh | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh)​ బీజేపీ (BJP)పై మరోసారి...

    TNGO’S Nizamabad | అంగన్​వాడీల సమస్యలను పరిష్కరించాలి

    అక్షరటుడే, ఇందూరు: TNGO'S Nizamabad |అంగన్​వాడీ (Anganwadi) ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవోస్ (TNGO'S Nizamabad)​ జిల్లా...

    Nizamsagar | బస్సులో నుంచి కిందపడి విద్యార్థికి గాయాలు

    అక్షర టుడే, నిజాంసాగర్‌: Nizamsagar | బస్సులో నుంచి కిందపడి విద్యార్థికి గాయాలైన ఘటన మండలకేంద్రంలో జరిగింది. స్థానికులు...