Hero Nithin
Hero Nithin | హీరోయిన్స్ కోసం స్పెష‌ల్‌గా వంట చేసి పెట్టిన నితిన్..తోడా ప్యాస్ దేదో భయ్యా అన్న ముద్దుగుమ్మ‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Hero Nithin | మంచి టాలెంట్ ఉన్నా నితిన్ ఎందుకో స‌క్సెస్ అందుకోలేక‌పోతున్నాడు. చివ‌రిగా రాబిన్ హుడ్ చిత్రంతో పెద్ద డిజాస్ట‌ర్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు త‌మ్ముడు చిత్రం(Thammudu Movie)తో రాబోతున్నాడు. అయితే నితిన్ సినిమా అంటే.. పవర్​ స్టార్​ పవన్ కల్యాణ్ రెఫరెన్స్ ఉండాల్సిందే. తన డెబ్యూ మూవీ ‘జయం’ నుంచే ఆయన ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ వస్తున్నాడు. ఓ పోస్టర్, ఓ డైలాగ్ లేదా ఓ క్లిప్ రూపంలో అయినా పవన్ పేరు గానీ, సినిమా గానీ, స్టైల్ గానీ నితిన్ సినిమాల్లో కనిపించేదే. ఎందుకంటే నితిన్ ఒక వీరాభిమాని. ఇక పవన్ కల్యాణ్(Pawan Kalyan) కూడా నితిన్‌కు త‌న స‌పోర్ట్ అందిస్తారు.

Hero Nithin | హీరోయిన్స్ కోసం స్పెష‌ల్‌గా..

ఇటీవల నితిన్ సినిమాల్లో పవన్ కల్యాణ్‌కు సంబంధించిన రిఫరెన్స్‌లు కనిపించకపోవడమే కాదు, ఉన్నా కూడా అవి హైలైట్ కావడం లేదు. అందుకే ఇప్పుడు నితిన్ నటించిన కొత్త సినిమా ‘తమ్ముడు’ అనే టైటిల్ ఎంతో ఆసక్తికరంగా మారింది. ఈ వారం థియేటర్లలోకి రానున్న ఈ సినిమా టైటిల్ పవన్ కల్యాణ్ సూపర్ హిట్ మూవీ ‘తమ్ముడు’ పేరుతో వ‌స్తోంది.. ఈ టైటిల్‌పై మొదట నితిన్(Hero Nithin) ఆసక్తిగా లేడ‌ట‌. కానీ దర్శకుడు వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజు(Producer Dil Raju) కలిసి నితిన్‌ను కన్విన్స్ చేయడంతో చివరకు ఆయన ఓకే చెప్పారు. ఈ సినిమా విడుదలకు రెండు రోజులు మాత్రమే మిగిలుండడంతో, నితిన్ త‌న ఫ్యాన్స్‌తో పాటు పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు ఎలాంటి ట్రీట్ ఇస్తాడా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి సంబంధించి గ‌త కొద్ది రోజులుగా ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. హీరో, హీరోయిన్స్, నిర్మాత‌లు ఇలా ప్ర‌తి ఒక్క‌రూ సినిమాను జ‌నాల్లోకి తీసుకెళ్లేందుకు చాలా కృషి చేస్తున్నారు. అయితే ఇటీవ‌ల నితిన్ త‌న హీరోయిన్స్ కోసం స్పెష‌ల్‌గా వంట చేసి మ‌రి తెచ్చాడు. చిత్రంలో నితిన్ సరసన కాంతార ఫేమ్ సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సీనియర్ నటి లయ(Senior actress Laya) కీలక పాత్ర పోషించారు. ఈ క్ర‌మంలో వారికి వెజ్‌, నాన్ వెజ్ స్వ‌యంగా చేసుకొని వ‌చ్చారు. అంద‌రు కూడా తెలుగు వంట‌కాలు మిస్ అయ్యారు కాబ‌ట్టి నేను మీ కోసం చేసుకొని తెచ్చాను అని అన్నాడు. అయితే అంద‌రు స‌ర్వ్ చేసుకుంటున్న స‌మ‌యంలో ఓ హీరోయిన్ స‌ర‌దాగా తోడా ప్యాస్ దేదో భ‌య్యా అనేసింది. దీంతో అంద‌రు న‌వ్వుకున్నారు. సాధార‌ణంగా మ‌నం పానీపూరీ బండ్ల ద‌గ్గ‌ర ఈ ప‌దం ఎక్కువ‌గా వింటుంటాం. ఓ హీరోయిన్ నోటి నుండి ఈ ప‌దం రావ‌డంతో ఇప్పుడు ఇది ట్రెండ్ అయింది.